KRNL: రాష్ట్రవ్యాప్తంగా బుడగ జంగాలను ఎస్సీలుగా గుర్తించాలని, వారి సమస్యలను వెంటనే పరిష్కరించాలని హోళగుంద బుడగ జంగం సంఘం నాయకులు రామాంజనేయులు అన్నారు. ఈ నేపథ్యంలోనే తహసీల్దార్ నిజాముద్దీన్‌కు సమస్యలతో కూడిన వినతిపత్రం అందించారు. గతంలో 2008 వరకు తమకు ఎస్సీలుగా గుర్తించి కుల ధ్రువీకరణ పత్రాలను అప్పటి అధికారులు జారీ చేశారని తెలిపారు.