అన్నమయ్య: విజయవాడ నుంచి వచ్చిన స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణ ఆంధ్ర సాస్ బృందం సోమవారం నిమ్మనపల్లె ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసింది. తనిఖీలో భాగంగా ఆస్పత్రి ఆవరణ, మల మూత్రశాలలు, తాగునీరు, బెండ్ల శుభ్రతను పరిశీలించారు. రోగులకు మెరుగైన వైద్యం అందిస్తే ఉత్తమ అవార్డుకు ఆస్పత్రిని ఎంపిక చేస్తామని ఎంపీడీవో రమేష్ తెలిపారు. ఈ తనిఖీలో అర్డబ్ల్యూఎస్ ఏఈ మధు పాల్గొన్నారు.