ELR: నూజివీడు ట్రిపుల్ ఐటీలో ప్రొఫెసర్ గోపాలరాజుపై ఎంటెక్ విద్యార్థి వినయ్ పురుషోత్తం కత్తితో దాడి చేశాడని డీఎస్పీ ప్రసాద్ తెలిపారు. సోమవారం నూజివీడు పట్టణ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 75% హాజరు లేకపోవడంతో పరీక్షకు అనుమతించకపోవడంతో విద్యార్థి దాడికి పాల్పడినట్లు డీఎస్పీ వివరించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేశారు.