సత్యసాయి: జిల్లాలో యూరియా, ఇతర ఎరువుల కొరత లేదని కలెక్టర్ టీఎస్ చేతన్ స్పష్టం చేశారు. ఆయన మాట్లాడుతూ.. ఇప్పటి వరకు 5,500 మెట్రిక్ టన్నుల యూరియా సరఫరా జరిగిందన్నారు. రోజుకు సగటున 145–150 టన్నులు వస్తుందని తెలిపారు. అక్రమ విక్రయాలు నివారిస్తున్నామని వెల్లడించారు. రైతులు ఈ పంట నమోదు ఈ నెల 30లోగా పూర్తి చేయాలని సూచించారు.