VZM: మెంటాడ మండలంలో జగన్నాథపురం వద్ద ఇటీవల కురిసిన వర్షాలతో ఫైపు కల్వర్టు కొట్టుకుపోయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నిర్మాణానికి 2.50 లక్షలు మంజూరు చేస్తున్నట్లు మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తెలిపారు. సోమవారం ఆమె కల్వర్టును పరిశీలించి అక్కడ ప్రజలతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం వెంటనే మరమ్మతులు చేపట్టాలని, కల్వర్టు నిర్మాణానికి అంచనాలు రూపొందించాలని ఆదేశించారు.