MDK: చిన్న శంకరంపేట మండలం చందంపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఉపాధ్యాయురాలు నవిత జిల్లా ఉత్తమ ఉపాధ్యాయురాలుగా అవార్డు అందుకున్న సందర్భం పురస్కరించుకొని తాజా మాజీ సర్పంచ్ తాటికొండ శ్రీలత స్వామి రాజ్, ఎస్సై నారాయణ గౌడ్, చేగుంట లైన్స్ క్లబ్ మాజీ అధ్యక్షులు బుర్కా నాగరాజు ఘనంగా సన్మానించారు.