కృష్ణా: నందిగామ మండలం గోళ్ళముడి గ్రామంలో సొసైటీ వద్ద యూరియా డీఏపీ ఎరువులను సొసైటీ ఛైర్మన్ గాడిపర్తి శ్రీనివాసరావు రైతులకు పంపిణీ చేశారు. గ్రామానికి చెందిన రైతులు సొసైటీ వద్దకు వచ్చి తమకు కావలసిన ఎరువులను తీసుకొని వెళ్లవచ్చని తెలియజేశారు. రాజకీయాలకు తావు లేకుండా రైతులందరికీ ఎరువులు అందజేయడం జరుగుతుందని అన్నారు.