W.G: జిల్లాలోని మైనర్ ఇరిగేషన్ ట్యాంకుల పునర్నిర్మాణానికి వెంటనే ప్రతిపాదనలు సిద్ధం చేయాలని కలెక్టర్ నాగరాణి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో డ్వామా, ఇరిగేషన్, గ్రౌండ్ వాటర్, ఆర్డబ్ల్యూఎస్, పంచాయతీరాజ్ అధికారులతో ఆమె సమీక్ష నిర్వహించారు. తాడేపల్లిగూడెం మెట్ట ప్రాంతంలో గుర్తించిన 54 మైనర్ ఇరిగేషన్ ట్యాంకులను పునర్నిర్మించాలని ఆమె సూచించారు.