KNR: నగరంలో మిలాద్ ఉన్ నబీ వేడుకలను మర్కజి మిలాద్ కమిటీ ఆధ్వర్యంలో సోమవారం ముస్లింలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ పమేలా సత్పతి, సీపీ గౌస్ ఆలం, ముస్లిం సోదరులు పాల్గొన్నారు. హుస్సేనీపుర బొంబాయి స్కూల్ నుంచి నాకా చౌరస్తా, మంచిర్యాల చౌరస్తా, గీతా భవన్ చౌరస్తా బస్టాండ్, వన్ టౌన్ పోలీస్ స్టేషన్, తెలంగాణ అమర వీరుల స్థూపం వరకు ర్యాలీ నిర్వహించారు.