ELR: సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా సోమవారం పెదవేగి మండలం పినకడిమి గ్రామంలో ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పర్యటించారు. గ్రామంలోని ప్రతి ఇంటికి వెళ్లి రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి పాలనను ప్రజలకు వివరించారు. అలాగే స్వయంగా కరపత్రాలను అందజేశారు. అలాగే గ్రామస్థులతో సమావేశం నిర్వహించారు.