SKLM: నకిలీ ఎరువులు వికయిస్తే చర్యలు తప్పవని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్, వ్యవసాయ అధికారులు హెచ్చరించారు. సోమవారం మందస గ్రామంలోని ఎరువుల దుకాణాలను ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ఎరువుల దుకాణాలలో స్టాక్ వివరాలు, రికార్డులు, ధరల అమ్మకాలను పరిశీలించారు. నిబంధనలకు విరుద్ధంగా అధిక ధరలకు ఎరువుల విక్రయాలు చేపట్టినట్లయితే ప్రభుత్వ పరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.