MDK: చేగుంట మండలం నడిమి తండా, సాజు తండా గ్రామాలలో సోమవారం ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బంది జ్వర సర్వే నిర్వహించారు. జిల్లా వైద్యాధికారి ఆదేశాల మేరకు మండల వైద్యాధికారి డాక్టర్ అనిల్ కుమార్ ఇంటింటి సర్వే నిర్వహించారు. పరిసరాల పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పించారు, సీజనల్ వ్యాధులు ప్రబలకుండా పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు.