TPT: వెంకటగిరి పోలేరమ్మ అమ్మవారి జాతర మహోత్సవం ఆహ్వాన పత్రికను ఇవాళ జిల్లా కలెక్టర్ డా.ఎస్.వెంకటేశ్వర్‌కు ఆలయ అధికారులు అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ పూజారులు ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు అందజేశారు. వేద పండితులు వేద ఆశీర్వచనాలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అధికారులు అర్చకులు పాల్గొన్నారు.