NRPT: ఊర్కొండ మండలంలోని మాదారానికి చెందిన శిరీషకు సోమవారం పురిటి నొప్పులు రావడంతో కుటుంబ సభ్యులు 108కి ఫోన్ చేశారు. వెంటనే స్పందించిన 108 సిబ్బంది ఆమెను జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే ఆమె ఒక మగ శిశువుకు జన్మనిచ్చింది. తల్లి, బిడ్డ ఇద్దరూ క్షేమంగా ఉన్నారని అంబులెన్స్ సిబ్బంది తెలిపారు.