TG: హైదరాబాద్ మెట్రోపాలిటన్ అభివృద్ధి సంస్థ కోకాపేట వద్ద నిర్మించిన ట్రంపెట్ ఇంటర్‌చేంజ్‌ను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. కోకాపేట నియోపోలీస్ ORR వద్ద ఈ ఇంటర్‌చేంజ్‌ను నిర్మించారు. కోకాపేట నియో పోలీస్ లేఅవుట్ నుంచి నేరుగా ఔటర్ రింగ్ రోడ్డుకు కనెక్ట్ చేసే ఈ ట్రంపెట్ ఇంటర్చేంజ్ వల్ల శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం చేరుకోవడానికి సమయం ఆదా అవుతుంది.