TPT: మూగ బాలికను రక్షించలేని ఈ ప్రభుత్వం ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే అంటూ మాజీ మంత్రి రోజా మండి పడ్డారు. విశాఖపట్నం సీతమ్మధారలో ఆదివారం సాయంత్రం ఓ మూగ బాలికపై దుండగులు అత్యాచారానికి పాల్పడిన ఘటన తెలిసిందే. దీనిపై ఆమె ‘X’ వేదికగా స్పందించారు. బాలికపై అత్యాచారం జరుగుతుంటే ప్రభుత్వం ఏం చేస్తోందని ప్రశ్నించారు.