VZM: చెక్కు బౌన్స్ కేసులో వ్యక్తికి జైలు జరిమానా విధిస్తూ గజపతినగరం కోర్టు న్యాయమూర్తి విజయ్ రాజ్ కుమార్ సోమవారం సాయంత్రం తీర్పు చెప్పారు. గజపతినగరం మండలం పురిటిపెంట న్యూ కాలనీకి చెందిన కంది వెంకటరమణ జక్కువకు చెందిన బాలి రాముకు ఇచ్చిన చెక్కు బౌన్స్ కావడంతో వెంకటరమణకు రెండు సంవత్సరాలు జైలు శిక్షతోపాటు 10 లక్షలు జరిమానా విధించారు.