దేశంలో కాలుష్యానికి ఏటా వేల మంది ప్రాణాలు కోల్పోతున్నట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. యువత ఊపిరితిత్తుల ఆరోగ్యం వేగంగా క్షీణిస్తున్నట్లు వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఏటా కొత్తగా సుమారు 82వేల ఊపిరితిత్తుల క్యాన్సర్ కేసులు నమోదవుతున్నాయని చెబుతున్నారు. ఊపిరితిత్తుల క్యాన్సర్, COPD, టీబీ వంటి వ్యాధులు ప్రస్తుతం యువతలో వేగంగా పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.