ప్రకాశం: ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి సహకారంతో వెలిగండ్ల మండలం నూతన టీడీపీ అధ్యక్షునిగా కేలం ఇంద్ర భూపాల్ రెడ్డి నియమితులయ్యారు. కనిగిరి పట్టణంలోని టీడీసీ కార్యాలయంలో పలువురు నాయకులు ఆయనను శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో కనిగిరి పట్టణ టీడీపీ అధ్యక్షులు ఫిరోజ్, బచ్చు రమేష్, సురేష్, కమ్మ వెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొన్నారు.