రేపు ఉపరాష్ట్రపతి ఎన్నిక జరగనున్న విషయం తెలిసిందే. అయితే, లోక్సభ 542, రాజ్యసభలో 239 సభ్యులు కలిసి మొత్తం ఎలక్టోర్ల సంఖ్య 781. ఇందులో మెజార్టీ మార్కు 391గా ఉంది. అధికార ఎన్డీయే కూటమికి 422 సభ్యుల బలముంది. ఇండియా కూటమికి 311 మంది బలముంది. ఇతరులు 45 మంది ఉన్నారు. దీంతో పార్టీలకు అతీతంగా ఆలోచించి ఓటు వేయాలని విపక్షాల అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.