KMR: నియోజకవర్గంలో ఇటీవల కురిసిన కుండపోత వర్షాల కారణంగా పలు ప్రాంతాలు నీట మునిగి పంట నష్టం, ఆస్థి నష్టం సంభవించగా, సోమవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. పంట నష్ట పోయిన రైతులకు ప్రభుత్వం నుంచి నష్ట పరిహారం అందించే దిశగా పని చేయాలని అధికారులను ఆదేశించారు.