JN: పాలకుర్తి మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయాన్ని ఇవాళ జాతీయ మాల మహానాడు నాయకులు ముట్టడించేందుకు ప్రయత్నించగా, పోలీసులు అడ్డుకున్నారు. అనంతరం తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ రిజర్వేషన్లు మాలలకు నష్టం కలిగించాయని, 5% రిజర్వేషన్‌ను 6%కు పెంచాలని మాల మహానాడు ఇన్ఛార్జ్ ఎనమల మహేష్ డిమాండ్ చేశారు.