కృష్ణా: మచిలీపట్నం ప్రభుత్వ మెడికల్ కాలేజ్‌ను ప్రభుత్వ మెడికల్ కాలేజ్‌గానే అభివృద్ధి చేస్తున్నామని మంత్రి కొల్లు రవీంద్ర స్పష్టం చేశారు. మచిలీపట్నంలో మీడియాతో మాట్లాడుతూ.. కొల్లు రవీంద్ర వైసీపీ నేతలు చేస్తున్న దుష్ప్రచారాన్ని ఖండించారు. వైసీపీ ప్రభుత్వంలో కేవలం 35% మాత్రమే పనులు జరిగాయని, తాము అధికారంలోకి వచ్చిన తర్వాత 55 నుంచి 60% మేర పనులు చేశామన్నారు.