SRCL: వేములవాడ మండలం అగ్రహారం డిగ్రీ కళాశాల విద్యార్థులకు సరిపడా తరగతి గదులు కేటాయించాలని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి మల్లారపు ప్రశాంత్ అన్నారు. సిరిసిల్లలోని కలెక్టరేట్లో జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్ సందీప్ కుమార్ ఝాకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఓకే భవనంలో డిగ్రీ, జేఎన్టీయూ ఉండడం వల్ల తరగతి గదులు సరిపోక ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు.