కడప: ఎరువులు బ్లాక్ మార్కెట్లోకి తరలిపోకుండా అధికారులు చర్యలు చేపట్టాలని నియోజకవర్గ సీపీఐ కార్యదర్శి ప్రసాద్ డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న యూరియా కొరత తీర్చాలని, ఎరువుల కేటాయింపులో రైతు సేవ కేంద్రాలు, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు ప్రధాన్యత ఇవ్వాలని తహశీల్దార్ కార్యాలయం వద్ద నిరసన తెలియజేశారు. అనంతరం వినతి పత్రం అందించారు.