W.G: కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రంలో మాలలపై దాడులు ఎక్కువయ్యాయని మాలల ఐక్య వేదిక నరసాపురం నియోజకవర్గ అధ్యక్షుడు కాకిలేటి ఆనంద్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. నరసాపురం స్టేషన్ పేటలో సోమవారం సాయంత్రం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం వచ్చిన ఏడాదిలో దళితులపై దాడులు అధికంగా జరుగుతున్నాయని, ముఖ్యంగా మాలలపై దాడులు ఆపాలన్నారు.