తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికలు మరింత ఆలస్యం కానున్నాయి. బీసీ రిజర్వేషన్లు తేలాకే ఎన్నికలకు వెళ్లాలని రేవంత్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కోర్టును ఆశ్రయించి గడువు కోరే యోచనలో ఉంది. కాగా, తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికలకు ఈ నెలాఖరుతో గడువు ముగియనుంది.