ELR: ఏలూరు దళిత ఉద్యమ నాయకుడు నూకపెయ్యి కార్తీక్ సోమవారం గుండెపోటుతో మరణించారు. రెండు రోజుల క్రితం కైకలూరులో దళితులపై జరిగిన దాడిని ఖండించి, ప్రభుత్వ ఆసుపత్రిలో బాధితులను పరామర్శించారు. దళితుల హక్కుల కోసం నిరంతరం పోరాడిన కార్తీక్ మృతి దళిత సమాజాన్ని, ఆయన కుటుంబాన్ని తీవ్ర విషాదాన్ని నింపింది. కార్తీక్ మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు