SRD: ఈ నెల17న తెలంగాణ విమోచన దినోత్సవం వేడుకలు ఘనంగా జరగనున్నాయి. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో కేంద్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో అధికారికంగా నిర్వహించనున్నట్లు బీజేపి నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు ఆధ్వర్యంలో పార్టీ కార్యకర్తలు, నాయకులు భారీ సంఖ్యలో పాల్గొననున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ అంజిరెడ్డికి ఆహ్వానం పలికారు.