VZM: ఈనెల 10న డయల్ యువర్ DPTO కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా ప్రజారవాణా అధికారి జి.వరలక్ష్మి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈమేరకు ఆరోజు ఉదయం 11 నుండి 12వరకు ఈ కార్యక్రమం నిర్వహిస్తామని జిల్లా పరిధిలో గల ప్రయాణికులు తమ సలహాలు, సూచనలు ఇవ్వాలన్నారు. అలాగే 9959225604 నంబరుకు ఫోన్ చేసి సమస్యలను తెలియజేయాలని కోరారు.