SRPT: మానసిక సమస్యతో తప్పిపోయిన కోదాడకి చెందిన మహమ్మద్ మహమ్మదీన్ను పోలీసులు ఇవాళ కుటుంబానికి అప్పగించారు. ఈ నెల 3న తప్పిపోయిన ఆయన ఆచూకీ కోసం సోషల్ మీడియాలో వచ్చిన ప్రచారం ఆధారంగా చివ్వెంల పోలీసులు సూర్యాపేటలోని 7th స్టార్ హోటల్ దగ్గర అతన్ని గుర్తించారు. నేరేడుచర్ల ఎస్సై రవీందర్ నాయక్ సహకారంతో కుటుంబసభ్యులకు అప్పగించారు.