GNTR: తుళ్లూరు లైబ్రరీ సెంటర్ వద్ద ఉన్న విజయ దుర్గ చికెన్ సెంటర్లో సోమవారం సాయంత్రం అగ్ని ప్రమాదం సంభవించింది. గ్యాస్ సిలిండర్ లీక్ అవ్వడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఇది గమనించిన స్థానికులు వెంటనే మంటలను ఆర్పివేశారు. దీంతో పెను ప్రమాదం తప్పిందని స్థానికులు చెబుతున్నారు.