ఆగస్టు నెలకు సంబంధించిన ప్లేయర్ ఆఫ్ ది మంత్ నామినీలను ఐసీసీ ప్రకటించింది. పురుషుల జాబితాలో టీమిండియా ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్, న్యూజిలాండ్ బౌలర్ మాట్ హెన్రీ, వెస్టిండీస్ బౌలర్ జేడెన్ సీల్స్ ఈ అవార్డు కోసం బరిలో నిలిచారు. ఇంగ్లండ్తో టెస్టు సిరీస్లో సిరాజ్ చేసిన అద్భత ప్రదర్శనకు గాను అతడు ఈ అవార్డు కోసం నామినేట్ అయ్యాడు.