MDK: జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ టేక్మాల్ మండలంలోని దన్నురా గ్రామంలోని ఇందిరమ్మ గృహ నిర్మాణ పనులను సోమవారం పరిశీలించారు. మండలంలో 474 ఇళ్లు మంజూరు చేయబడినట్లు, వివిధ దశలలో నిర్మాణం జరుగుతున్నాయని తెలిపారు. వెంటనే ఇళ్ల నిర్మాణం పూర్తి చేయాలని సూచించారు. ఈ వారంలో జిల్లా వ్యాప్తంగా 378 లబ్ధిదారుల ఖాతాల్లో 3 కోట్లు 88 లక్షలు జమ చేయడం జరిగిందన్నారు.