కృష్ణా: కోడూరు RTC బస్టాండ్ వద్ద రోడ్డుపై నిలిచిన నీటిని తొలగించి, గుంతలను పూడ్చాలని ప్రయాణికులు కోరుతున్నారు. ప్రధాన రహదారి నుంచి బస్టాండ్ లోపలికి వెళ్లే దారిలో గుంతలు ఏర్పడ్డాయి. వర్షం కురిసినప్పుడు ఈ గుంతల్లో నీరు చేరి చెరువులా మారుతోందని, ప్రయాణికులు బస్టాండ్ లోపలికి వెళ్లడానికి ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.