ఉత్తరప్రదేశ్లోని మోరాదాబాద్లో శిశువును తల్లి ఫ్రిజ్లో పెట్టిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఓ మహిళ తన 15 రోజుల పసికందును వంటగదికి తీసుకెళ్లి ఫ్రిజ్లో పెట్టింది. అనంతరం ఆమె తన గదికి వచ్చి నిద్రపోయింది. అయితే, చిన్నారి ఏడుపు విన్న కుటుంబసభ్యులు బాలుడిని రక్షించారు. కాగా, ప్రసవానంతరం ఆ మహిళ మానసిక సమస్యలతో ఇబ్బంది పడుతున్నట్లు వైద్యులు వెల్లడించారు.