AP: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని, ఆయనపై చర్యలు తీసుకోవాలని హైకోర్టులో పిటిషన్ దాఖలైన విషయం తెలిసిందే. డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ సినిమా షూటింగ్లో పాల్గొనడంపై మాజీ ఐఏఎస్ అధికారి విజయ్ కుమార్ అభ్యంతరం వ్యక్తం చేస్తూ హైకోర్టులో పిటిషన్ వేశారు. ఇరువర్గాల వాదనలు విన్న న్యాయస్థానం విచారణను ఈనెల 15కు వాయిదా వేసింది.