JN: జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ రైతుల సౌలభ్యం కోసం అదనపు యూరియా విక్రయ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. PACS డీలర్లకు సోమవారం ఈ–పాస్ యంత్రాలు పంపిణీ చేసి, యూరియా సరఫరా పారదర్శకంగా సాగుతుందని చెప్పారు. రైతులు ఆధార్, పంట రిజిస్ట్రేషన్ పత్రాలతో మాత్రమే కొనాలన్నారు. అక్రమ నిల్వలు, బ్లాక్ మార్కెటింగ్ చేస్తే చర్యలు తీసుకుంటామన్నారు.