JGL: రైతులు పాడి పరిశ్రమపై దృష్టి సారించాలని, కోరుట ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ అన్నారు. సోమవారం ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన కరీంనగర్ డైరీ పార్లర్ కేంద్రాన్ని ఆయన కరీంనగర్ డైరీ చైర్మన్ చల్మెడ రాజేశ్వర్ రావుతో కలిసి ప్రారంభించారు. రైతులు వ్యవసాయంతో పాటు పాడి పరిశ్రమపై దృష్టి సారించి ఆర్థికంగా అభివృద్ధి చెందాలన్నారు.