NLG: జీవో 99, రోస్టర్ పాయింట్ విధానం వల్ల ఎస్సీ గ్రూపు-3 లోని మాల, దాని అనుబంధ 26 కులాలకు అన్యాయం జరుగుతుందని మాల మహానాడు నేషనల్ స్టీరింగ్ కమిటీ నెంబర్ గోలి సైదులు ఆవేదన వ్యక్తం చేశారు. జనాభా లెక్కల ప్రకారం శాస్త్రీయంగా ఎస్సీ వర్గీకరణ జరగకపోవడంతో కళాశాలల సీట్లు, ఉద్యోగాల భర్తీలో అన్యాయం జరుగుతుందని ప్రజావాణిలో కలెక్టర్కు వినతిని అందించారు.