న్యాచురల్ స్టార్ నాని, శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘ది ప్యారడైజ్’. ఈ చిత్రంలో నాని ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు కొత్త లుక్‌లో విభిన్నమైన కథాంశంతో సిద్ధమయ్యాడు. ఈ సినిమా కోసం నిర్మాతలు హైదరాబాద్ శివార్లలో దాదాపు 30 ఎకరాల విస్తీర్ణంలో భారీ మురికివాడల సెట్‌ను నిర్మించనున్నారని సమాచారం. వచ్చే ఏడాది మార్చి 26న 8 భాషల్లో విడుదల కానుంది.