ATP: అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విడపనకల్లు గ్రామవాసి ఉలిగన్నను సోమవారం గుంతకల్లు రెవెన్యూ డివిజనల్ ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు డాక్టర్ హరిప్రసాద్ యాదవ్ పరామర్శించారు. వినాయక నిమజ్జనం రోజున ఉలిగన్నపై కొందరు దాడి చేయడం దారుణం అన్నారు. వారి కుటుంబాన్ని పరామర్శించి తగు న్యాయం జరిగేలా చూస్తామన్నారు.