ELR: జిల్లా వ్యాప్తంగా ప్రజా సమస్యల పరిష్కార వేదికకు సోమవారం 38 ఫిర్యాదులు వచ్చాయని జిల్లా ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్ తెలిపారు. వీటిని వెంటనే పరిష్కరించేందుకు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. సైబర్ నేరగాళ్ల వల్ల మోసపోవద్దని ఫిర్యాదుదారులను హెచ్చరించారు. ఫిర్యాదుదారులకు ఉచిత భోజన సౌకర్యాన్ని సత్యసాయి సేవా ట్రస్టు ద్వారా ఏర్పాటు చేశారు.