SKLM: ఉపాధి హామీ సిబ్బంది యొక్క సమస్యలపై తప్పనిసరిగా అసెంబ్లీలో చర్చించి ప్రభుత్వానికి నివేదిస్తానని ఎమ్మెల్యే కూన రవికుమార్ తెలిపారు. సోమవారం రాత్రి జిల్లా ఉపాధి హామీ ఎంప్లాయిస్ యూనియన్ సభ్యులు ఆయనను కలిసి వినతిపత్రం సమర్పించారు. ఔట్ సోర్స్ ఉద్యోగులను ఎఫ్టీఈలుగా నియమించాలని వారు కోరారు. ప్రభుత్వ ఉద్యోగులుగా తమను గుర్తించాలన్నారు.