MLG: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ చంద్రశేఖర్‌ను MRPS జిల్లా అధ్యక్షుడు గడ్డం భద్రయ్య మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా భద్రయ్య ఆయనను శాలువాతో సన్మానించారు. భద్రయ్య మాట్లాడుతూ.. ఆసుపత్రిలో వైద్య పరికరాలు, మందులు అందుబాటులో ఉంచాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ నాయకులు తదితరులు ఉన్నారు.