NLG: గురువులు సమాజ మార్గదర్శకులని, జీవితానికి వెలుగు బాటను ప్రసాదించే గురువు రుణాన్ని శిష్యుడు ఏ రూపంలోనూ తీర్చుకోలేడని కనగల్ ఎంపీడీవో సుమలత, జూనియర్ కాలేజీ ప్రిన్సిపాల్ సుధారాణి అన్నారు. ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని మండల కేంద్రంలోని జూనియర్ కళాశాల ఆవరణలో సోమవారం నిర్వహించిన సన్మాన కార్యక్రమంలో వారు పాల్గొని మాట్లాడారు.