SKLM: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాబోధన మరింత మెరుగుపడాలని ఎంఈవో బమ్మిడి మాధవరావు తెలిపారు. జలుమూరు మండలంలోని కె ఎల్ ఎన్ పేట, లింగాలపాడు తదితర పాఠశాలలను మంగళవారం ఆయన పరిశీలించారు. ఆయన విద్యార్థులతో మమేకమై వారి సామర్థ్యాలను నేరుగా అడిగి తెలుసుకున్నారు. మెరుగైన ఫలితాలు సాధించే దిశగా ఉపాధ్యాయులు కృషి చేయాలని విద్యార్థులు కూడా శ్రద్ధ పెట్టాలన్నారు.