PPM: వీరఘట్టం మార్కెట్ యార్డ్ సమీపంలో మంగళవారం రైతులు యూరియా కోసం ఆందోళన చేపట్టారు. సమాచారం తెలుసుకున్న వ్యవసాయ అదికారి సౌజన్య అక్కడకు చేరుకున్నారు. అనంతరం రైతులు ఆందోళన చెందవద్దని ప్రతి రైతుకు యూరియా అందజేస్తామని హామీ ఇచ్చారు. ప్రస్తుతం 400 బస్తాలు అందుబాటులో ఉన్నాయన్నారు. మరో రెండు రోజుల్లో మరో 800 బస్తాలు వస్తాయని రైతులు అందరికీ అందజేస్తామని ఏవో పేర్కొన్నారు.