ATP: గుత్తి మండలం బేతపల్లి గ్రామంలో సుంకన్న అనే వృద్ధుడు మంగళవారం కడుపునొప్పి తాళలేక పెట్రోల్ తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. అపస్మారక స్థితికి పడి ఉన్న సుంకన్నను గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే గుత్తి ఆసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కొరకు అనంతపురం రెఫర్ చేశారు. ఈ సంఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.