ELR: నూజివీడు మండలంలోని తుక్కులూరు గ్రామంలో రోడ్డు వెంట చెత్త కుప్పలు పేరుకుపోవడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గ్రామంలో ప్రాంతీయ రవాణా కార్యాలయం వైపు వెళ్లే ప్రధాన రహదారికి ఇరువైపులా చెత్త కుప్పలు పేరుకుపోవడం వలన ఇబ్బందులు ఎదురవుతున్నాయని వాహన చోదకులు వాపోతున్నారు. చెత్తను తొలగించాలని ప్రజలు కోరుతున్నారు.